Oct 23 2021 @ 11:34AM

Genelia D'Souza ను కొట్టినందుకు పగ తీర్చుకున్న Riteish Deshmukh.. వీడియో వైరల్!

బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ పగ తీర్చుకున్నాడు. తన భార్య, హీరోయిన్ జెనీలియాను కొట్టిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాడు. గతంలో జెనీలియాను కొట్టిన నటుడు ఆయజ్ ఖాన్‌‌ను చితక్కొట్టేశాడు. అయితే ఇదంతా సీరియస్‌గా కాదు లెండి.. సరదాగానే. గతంలో ఆయజ్ ఖాన్, జెనీలియా కలిసి నటించిన చిత్రం `జానే తూ యే జానే నా`. సూపర్ డూపర్ హిట్ అయిన ఆ చిత్రంలో జెనీలియాకు బాయ్‌ఫ్రెండ్ పాత్రలో ఆయజ్ ఖాన్ నటించాడు. 

ఆ సినిమాలో ఓ సన్నివేశంలో జెనీలియాను ఆయజ్ కొడతాడు. దానికి ప్రతిగా రితేష్ తాజాగా ఆయజ్‌ను సరదాగా కొట్టాడు. ఆ వీడియోను ఆయజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. `ఈ ద్వేషం ఎప్పటికీ ఆగదా` అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్, జెనీలియా జంటగా నటించిన `జానే తూ యే జానే నా` చిత్రం 2008లో విడుదలైంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.