Abn logo
Jul 11 2020 @ 05:36AM

వైరస్‌ ఉధృతి

మార్కాపురంలో  20 రోజుల్లో 176 కరోనా కేసులు

పామూరులోనూ పెరుగుతున్న బాధితులు

హోం క్వారంటైన్‌కు తరలింపుపై  సర్వత్రా ఆందోళన

కనిగిరిలో లాక్‌డౌన్‌..  అవస్థ పడిన ప్రజలు


మార్కాపురం, జూలై 10 : మార్కాపురం పట్టణంలో కరోనా విశ్వరూపం  చూపుతోంది. 20 రోజుల్లో 176 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వైరస్‌ ప్రారంభమైన తొలినాళ్లలో ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్‌ ఉన్నట్లు ని ర్ధారణ అయ్యింది. తర్వాత రెండు నెలలపాటు కరోనా ఆనవాళ్లు మార్కాపురంలో కనిపించలేదు.


ఈ తరుణం లో జూన్‌ ద్వితీయార్థంలో మరో కరోనా కేసు నమో దైంది. ఆ తర్వాత 20 రోజుల వ్యవధిలో  176 మందికి సోకింది. దీంతో  యంత్రాంగం పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ పేరుతో ఈనెల 3,4,5 తేదీలలో పూర్తి స్థాయి లో ప్రజలను రోడ్లపైకి రానీయకుండా కట్టుదిట్టం చేశా రు. అయినప్పటికీ ఫలితం కన్పించ లేదు. పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో అవన్నీ రెడ్‌జోన్‌ పరిధిలో చేరాయి. నిత్యావసరాల కోసం పోలీసులు  ఉదయం 6   నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆంక్షలు సడలిసు ్తన్నారు.  పట్టణంలో నాలుగు సూపర్‌ మార్కెట్ల ద్వారా డోర్‌ డెలివరీ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 


కరోనా బాధితులు క్వారంటైన్‌కు..

కనిగిరిలో కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి. పట్టణంలోని ముగ్గుబావి వీధికి చెం దిన వ్యక్తికి, పాతూరుకు చెందిన కారు డ్రైవర్‌కు, ఉం గరం బిల్డింగ్‌ దగ్గర ఓ మహిళకు, ఓ రాజకీయ ప్రముఖుడికి కరోనా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ ఎన్‌.నాగరాజ్యలక్ష్మి శుక్రవారం వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులను రెండు అంబులెన్స్‌లలో ఒంగోలుకు తరలించారు.


అదే విధంగా ‘‘రాజకీయ ప్రముఖులకు కరోనా’’ అని ఆంధ్రజ్యోతి మినీలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారులు ఆగమేఘాల మీద స్పందించి మార్కెట్‌ యార్డులో దాదాపు 35 మందికి రాజకీయ ప్రముఖులకు, మార్కెట్‌ యా ర్డు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.  కాగా కరోనా బాధితులు పెరగడంతో నగర పంచాయతీ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉ  దయం వరకు పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు కొనుక్కునేందుకు ప్రజలు ఉదయాన్నే ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రద్దీ ఏర్పడింది. 

Advertisement
Advertisement
Advertisement