Abn logo
Sep 15 2020 @ 05:26AM

పెరుగుతున్న కరోనా చావులు

Kaakateeya

ఉమ్మడి జిల్లాలో నలుగురి మృతి, 702 పాజిటివ్‌ కేసులు నమోదు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి జిల్లాలో కరోనా చావులు పెరుగుతున్నాయి. సోమవారం నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారిం చారు. ఇందులో రంగారెడ్డిలో ముగ్గురు, వికారాబాద్‌లో ఒకరు ఉన్నారు. ఇప్పటి వరకు మూడు జిల్లాలో కరోనాతో బలైన వారి సంఖ్య 225కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య సెంచరీ దాటింది. 


ఉమ్మడి జిల్లాలో 702 కేసులు

ఉమ్మడి జిల్లాలో సోమవారం 702 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 281, మేడ్చల్‌ జిల్లాలో 401, వికారాబాద్‌ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. 


చేవెళ్ల డివిజన్‌లో...

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌లో 171మందికి  కరోనా పరీ క్షలు చేయగా 15మందికి పాజిటివ్‌ వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 17మందికి పరీక్షలు చేయగా 1, ఆలూర్‌ ఆసుప్రతిలో 16మందికికిగాను 2, శంకర్‌పల్లి మండలంలో 60మందికిగాను 2, మొయినాబాద్‌ మండలంలో 37మందికిగాను 3, షాబాద్‌ మండలంలో 41 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో...

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 399 మందికి కరోనా టెస్టులు చేయగా 52 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 14, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 25 మందికిగాను 5,  దండుమైలారంలో 53 మందికిగాను 4, ఎలిమినేడులో 40 మందికిగాను 3,  మంచాలలో 42 మందికిగాను 1, ఆరుట్లలో 36మందిలో 1, యాచారంలో 42 మం దికిగాను 2, మాడ్గ్గులలో 37 మందికిగాను 3, సీహెసీ హయత్‌నగర్‌లో 15 మందికిగాను 1, తట్టిఅన్నారంలో 23 మం దికిగాను 5, రాగన్నగూడలో 36 మందికిగాను 13 మందికి పాజిటివ్‌ అని తేలింది.


కందుకూరులో...

కందుకూరు / శంషాబాద్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 51మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో కొహెడ గ్రామానికి చెందిన ఇద్దరు, నేదునూరుకు చెందిన ఇద్దరు, గూ డూరు, మంఖాల్‌, మహ్మద్‌నగర్‌, కందుకూరు, కందుకూరు చౌరస్తా, జైత్వారం గ్రామానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అదేవిధంగా శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 73 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో....

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 236మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. అందులో షాద్‌నగర్‌కు చెందిన 9మంది, కొత్తూర్‌ మండలానికి చెందిన ఏడుగురు ఉండగా, మిగతా ఆరుగురు ఇతర మండలాలకు చెంది నవారున్నారని వివరించారు.


కందివనంలో కరోనా వణుకు

షాద్‌నగర్‌అర్బన్‌ : ఫరూఖ్‌నగర్‌ మండలం కందివనం గ్రామాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్నది. గ్రామంలోనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారించారు. ఒకే వంశస్థుల్లో 35వరకు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దాంతో రెండు రోజులుగా గ్రామంలో వైద్య శిబి రాన్ని ఏర్పాటు చేసి అనుమానితులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆదివారం 122, సోమవారం మరో వందకు పైగా శాంపిల్స్‌ సేకరించారు. శాంపిల్స్‌ సేకరించిన వారి ఫలితాన్ని మంగళవారం చెబుతామని వైద్య శిబ్బంది తెలిపారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన మనుమరాలు ఆనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని వచ్చాడని, అదే కుటుంబ సభ్యులు షాద్‌నగర్‌లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి వచ్చారని, ఫంక్షన్‌కు వెళ్లివచ్చిన వారికే అత్యధితకంగా పాజిటివ్‌ వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. 


కులకచర్లలో..

కులకచర్ల: కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 37 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో కులకచర్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌గా నమోదైనట్లు వైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు. 


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 54 మందికి కరోనా పరీక్షలు చేయగా 12మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా శ్రీరంగవరం ప్రాథమిక వైద్య కేంద్రంలో 42మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యురాలు నళిని తెలిపారు.

Advertisement
Advertisement