Abn logo
Aug 14 2020 @ 12:21PM

ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న హీరో విజయ్ అభిమాని ఆత్మహత్య పోస్టులు

తమిళనాడులో హీరో ఇళయథలపతి విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరం కుర్రాళ్లలో విజయ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. విజయ్‌కు తమిళనాడులో కొన్ని లక్షల మంది అభిమానులున్నారు. ఆ అభిమానుల్లో కూడా వీరాభిమానులు కొందరుంటారు. విజయ్ సినిమా విడుదలవుతుందంటే వాళ్లకది పండగ రోజే. బాణసంచాలు, తీన్మార్ డ్యాన్స్‌లు, థియేటర్ ముందు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, కటౌట్లకు పాలాభిషేకాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లు చేసే సందడి అంతాఇంతా కాదు.


విజయ్‌పై అంతటి అభిమానం కలిగిన వారిలో బాలా అనే కుర్రాడు ఒకరు. కారణమేంటో తెలియదు గానీ బాలా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. బాలా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న పోస్ట్‌లతో ట్విట్టర్ హోరెత్తుతోంది. ట్విట్టర్‌లో #RIPBala ట్వీట్స్ ట్రెండ్ అవుతున్నాయి. సూసైడ్ సమస్యలకు పరిష్కారం కాదని, జీవితం చాలా చిన్నదని.. ఇలా అర్థాంతరంగా ముగించొద్దని విజయ్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement