ఆ నటుడి భార్యగా.. దశాబ్దం తర్వాత రీమా రీ ఎంట్రీ

కొన్ని సంవత్సరాల క్రితం మలయాళంలో బిజీ హీరోయిన్‌గా ఉన్న రీమా కల్లింగల్‌ తమిళంలో మాత్రం ఒకే ఒక చిత్రంలో హీరో భరత్‌ సరసన కథా నాయికగా నటించింది. ఆ తర్వాత ఆమె మలయాళ దర్శకుడు అశిష్‌ అబును పెళ్ళి చేసుకుని ఎంపిక చేసిన చిత్రాల్లో మాత్రమే నటించింది. ఈ నేపథ్యంలో దాదాపు పదేళ్ళ తర్వాత కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. స్టంట్‌ మాస్టర్‌ సిల్వా తొలిసారి దర్శకత్వం వహించిన ‘చిత్తిరై సెవ్వానం’  చిత్రంలో సముద్రఖని భార్య పాత్రలో ఆమె నటించింది. ఈ మూవీలో హీరోయిన్‌ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ మరో కీలక పాత్రను పోషించింది. 


దశాబ్ద కాలం తర్వాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె స్పందిస్తూ.. ‘‘ఈ చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించాను. దర్శకుడు సిల్వా ఒక స్టంట్‌ మాస్టర్‌ కావడంతో నాకు కూడా కొన్ని ఫైట్స్‌ సన్నివేశాలుంటాయని భావించారు. కానీ, ఆయన శైలికి పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని సిల్లా తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ఈ మూవీ నా రీ ఎంట్రీకి మంచి మార్గాన్ని చూపిస్తుందనే ఆశ ఉంది’’ అని రీమా కల్లింగల్‌ వెల్లడించింది.

Advertisement