Abn logo
Mar 5 2021 @ 23:53PM

ఘనంగా కుంకుమార్చన

కొనసాగుతున్న అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు

ఖానాపూర్‌, మార్చి 5 : మండల కేంద్రంలోని శాంతినగర్‌ కాలనీలోని ముత్యాలపోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు గత రెండు రోజులుగా కన్నుల పండువగా సాగుతున్నాయి. శుక్రవారం ఆలయ ఆవరణలో నిర్వ హించిన కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు అధికసంఖ్యలో తరలి వచ్చారు. ఆలయానికి వచ్చిన మహిళలచే ఆలయ అర్చకులు నిమ్మగడ్డ శరత్‌చంద్ర కుంకుమార్చన చేయించారు. ఈ కుంకుమార్చన విశిష్టతను భక్తు లకు తెలియజేశారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇక్కట్లు కలుగకుండా మున్సిపల్‌ చైర్మన్‌, ఆలయకమిటి అధ్యక్షులు అంకం రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆలయకమిటీ బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


Advertisement
Advertisement