Oct 14 2021 @ 13:10PM

కొడుక్కి షారూఖ్ కూడా ఇంత సహాయం చేయలేదంటూ.. Arayn Khan గురించి RGV వరుస ట్వీట్స్

ఇన్ని రోజులూ యువరాజులా దర్జాగా జీవితం గడిపిన స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఎన్‌సీబీ క‌స్ట‌డీలో, ఆర్థ‌ర్ రోడ్ జైల్లో అష్టకష్టాలు పడుతున్నాడు. అక్కడి తిండి తినలేక, బాత్రూమ్‌కు వెళ్లలేక ఆర్యన్ అపసోపాలు పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఈ నెల రెండో తేదీన అరెస్ట్ అయిన ఆర్యన్ అప్పటి నుంచి ఎన్‌సీబీ కస్టడీలోనే ఉన్నాడు. ఆర్యన్ అరెస్ట్ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులందరూ షారూఖ్‌కు మద్దతుగా నిలిచారు. ఆర్యన్‌కు అంతా మంచే జరుగుతుందని ట్వీట్లు చేస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఆర్యన్ గురించి ట్వీట్లు చేశాడు. 


ఆర్యన్‌కు షారూక్ కూడా చేయలేని సహాయం ఎన్‌సీబీ చేసిందని వర్మ వరుస ట్వీట్లు చేశాడు. `షారూఖ్ వంటి తండ్రి ఉండడం వల్ల ఆర్యన్ సూపర్ స్టార్‌ మాత్రమే కాగలిగాడు. కానీ, ఎన్‌సీబీ అతడిని సూపర్ డూపర్ స్టార్‌ను చేసింది. నిజమైన షారూఖ్ ఫ్యాన్ ఎవరైనా ఎన్‌సీబీకి ధన్యవాదాలు చెప్పాలి. షారూఖ్‌కు నిజమైన అభిమానిని అయిన నేను `జై ఎన్‌సీబీ` అని అరవాలనుకుంటున్నా` అంటూ వర్మ ట్వీట్ చేశాడు.


అలాగే `తన తండ్రి దగ్గర్నుంచి కంటే జైలు జీవితం నుంచి ఎన్‌సీబీ నుంచే ఎన్నో అద్భుత విషయాలు నేర్చుకున్నానని భవిష్యత్తులో ఆర్యన్ చెబుతాడని నా విశ్వాసం`, `షారూఖ్ కంటే ముందే ఎన్‌సీబీ, మీడియా ఆర్యన్‌కు అద్భుతమైన లాంఛ్ ఇచ్చాయి`, `సినిమా టైటిల్: రాకెట్, హీరో: ఆర్యన్ ఖాన్, నిర్మాత: ఎన్‌సీబీ, సహ నిర్మాతలు: కొన్ని రాజకీయ పార్టీలు, దర్వకత్వం: మీడియా` అంటూ తనదైన శైలిలో వర్మ కామెంట్లు చేశారు. 


 


Bollywoodమరిన్ని...