Abn logo
Aug 3 2021 @ 23:14PM

భూ రికార్డుల స్పష్టీకరణపై దృష్టి పెట్టండి

అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న జేసీ అంబేడ్కర్‌ (రెవెన్యూ)

బుట్టాయగూడెం, ఆగస్టు 3: కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లలో భూరికార్డులు పెండింగ్‌ లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ (రెవెన్యూ) రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. కేఆర్‌.పురం ఐటీడీఏ కార్యాలయంలో రెండు డివిజన్ల పరిధి లోని అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహిం చారు. రికార్డుల స్పష్టీకరణతోపాటు రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. అప్‌గ్రేడ్‌ విషయంలో పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్‌ డిపోల ద్వారా బియ్యం పంపిణీ, రెవె న్యూ శాఖ సంబంధిత అంశాలపై ఆయన సమీక్ష చేశారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో అధికారులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఓ.ఆనంద్‌, ఆర్డీవో వైవీ.ప్రసన్నలక్ష్మి, రెండు డివిజన్ల తహసీ ల్దార్లు, సర్వే డిపార్టుమెంట్‌ అధికారులు పాల్గొన్నారు.