Abn logo
Aug 8 2020 @ 21:33PM

50ఏళ్ల క్రితం తుపాకీతో కాల్చిన వ్యక్తిని.. పట్టుకున్న రిటైర్డ్ పోలీసు!

కొలరాడో: తనను 50ఏళ్ల క్రితం తుపాకీతో కాల్చిన ఓ వ్యక్తిని పట్టుకున్నాడో రిటైర్డ్ పోలీసు. ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డారిల్ సింకాంతా అనే వ్యక్తి పోలీసు ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. 50ఏళ్ల క్రితం డ్యూటీలో ఉండగా అతను ఓ కారును ఆపాడు. కారులోని లూయిస్ ఆర్కులేటా అనే వ్యక్తిని ఐడీకార్డు చూపించాలని ఆదేశించాడు. ఆ సమయంలో డారిల్‌ను లూయీస్ తుపాకీతో కాల్చి పారిపోయాడు. అతన్ని అరెస్టు చేసి 1973లో జైల్లో వేశారు. ఏడాది తర్వాత జైలు నుంచి లూయీస్ పారిపోయాడు. ఇదిగో మళ్లీ ఇప్పుడు డారిల్ చేతికి చిక్కాడు.

Advertisement
Advertisement
Advertisement