Abn logo
Jul 11 2020 @ 06:09AM

డిగ్రీ, పీజీ పరీక్షలపై పునరాలోచించండి

డీసీసీ అధ్యక్షుడు రమేష్‌కుమార్‌


నెల్లిమర్ల, జూలై 10: డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో యూజీసీ వెనక్కు తగ్గాలని డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. ఆయన శుక్రవారం నెల్లిమర్లలో విలేకర్లతో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల గత ఐదు నెలలుగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారని చెప్పారు.

అయితే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ అర్ధాంతరంగా నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. యూజీసీ తన నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే యూజీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌యూఐ చేపడుతున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌ ఫీజులు రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement