Abn logo
May 27 2020 @ 23:22PM

రెస్టారెంట్ యజమాని భారీ ఆఫర్.. బర్గర్ తింటే.. రూ.93వేలు!

లండన్: తమ రెస్టారెంట్‌లో తయారు చేసిన ప్రత్యేకమైన బర్గర్‌ను 20 నిమిషాల్లో తింటే.. దాదాపు రూ.93వేల ఇస్తానంటూ బ్రిటన్‌లోని రెస్టారెంట్ యజమాని భారీ ఆఫర్ ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ కారణంగా బ్రిటన్‌లోని వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్‌లు అన్ని మూతపడ్డాయి. అయితే క్రమంగా బ్రిటన్‌లో ఆంక్షలు సడలిస్తుండటంతో రెస్టారెంట్‌లు, వ్యాపార సముదాయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రెస్టారెంట్ ఓనర్ వినూత్నంగా ఆలోచించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఓ భారీ ఆఫర్ ప్రకటించాడు. తమ రెస్టారెంట్‌లో తయారు చేసిన 14 ఇంచుల ప్రత్యేకమైన బర్గర్‌ను.. కేవలం 20 నిమిషాల్లో తింటే.. రూ. 93వేలు ఇస్తానంటూ వెల్లడించాడు. 14 ఇంచుల బర్గర్.. 20 నిమిషాల్లో ఈజీగా తినొచ్చు అనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడ్డట్టే.. ఎందుకంటే.. ఆ బర్గర్ బరువు సుమారు రెండు కేజీల బరువు ఉంటుందని యజమాని పేర్కొన్నాడు. అంతేకాదు బహుమతి కూడా డబ్బుల రూపంలో కాకుండా ఫుడ్ ఓచర్‌ రూపంలో ఇస్తానని సదరు యజమాని స్పష్టం చేశాడు. కాగా.. మొదటగా ఈ ఆఫర్ తెలుసుకున్న ప్రజలంతా.. బర్గర్ తినడానికి సిద్ధమైపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని.. నిరాశగా వెనుదిరుగుతున్నారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement