Abn logo
Oct 23 2020 @ 05:39AM

యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి : రాచాల

కొత్తకోట, అక్టోబరు 22: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న ప్రైవేటు యూనివర్సిటీలలో రిజ ర్వేషన్లు అమలుచేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగం ధర్‌ గౌడ్‌ అన్నారు. ఆ సంఘం పిలుపు మేరకు స్థానిక నాయకులు నల్లా బ్యాడ్జీలు ధరించి గు రువారం కొత్తకోట చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ బడుగు బలహీనవర్గాల విద్యా ర్థులకు ఉన్నత విద్యను దూరంచేసే కుట్రచేస్తోందని ఆరోపించారు. ఆ సంఘం నాయకులు భీమన్న నాయుడు, అంజన్నయాదవ్‌, అశోక్‌కుమార్‌, వడ్డె వెంకటేష్‌, నక్కరాములు, చిన్న ఆంపన్నగౌడ్‌, నాగులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement