Abn logo
Jun 19 2021 @ 20:34PM

సెంట్రల్‌ లైటింగ్‌ కోసం వినతి

ఎంపీ గురుమూర్తికి వినతిపత్రం అందజేస్తున్న నక్కా భానుప్రియ

వెంకటగిరి(టౌన్‌), జూన్‌ 19:  మున్సిపాలిటీ పరిధిలోని ఏర్పేడు పెంచలకోన జాతీయ రహదారిలో బంగారుపేట నుంచి వైఎస్‌ఆర్‌ లేఅవుట్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా యాజమాన్యాన్ని కోరాలంటూ,  మున్సిఫల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ శనివారం తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 92 కోట్లతో మరో సమ్మర్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత డైరెక్టర్‌ నక్కా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.