Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేపు సీఎం జగన్‌ రాక

వరద ప్రవాహానికి హైస్కూల్లో కూలిన ప్రహరీగోడ, కోతకు గురైన ఆవరణను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే.

రూట్‌ పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ, ఇంటలిజెన్స్‌ ఎస్పీ, ఎమ్మెల్యే 


బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 1: ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) సీఎం జగన్మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనతో పాటు బాధితులను పరామర్శించేందుకు జిల్లా పర్యటనలో భాగంగా బుచ్చి మండలంలో ఆయన పర్యటించే మార్గంలో పలు ప్రాంతాలను బుధవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయరావు, ఇంటలిజెన్స్‌ (సీఎం సెక్యూరిటీ) ఎస్పీ జిందాల్‌, డీఎస్పీ హరనాథరెడ్డి,  ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. ముందుగా ఎమ్మెల్యే ప్రసన్న బుచ్చిలో ఆ పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, పెనుబల్లి సర్పంచు ఊడా పెంచలయ్యతో పాటు పలువురితో చర్చించి ముందస్తు ప్రణాళికలో భాగంగా పెనుబల్లిలో కోతకు గురైన బుచ్చి-జొన్నవాడ మార్గంలోని రోడ్డును, కూలిన ఇళ్లు, హైస్కూల్‌ ప్రహరీ, పశువైద్యశాల ప్రహరీని పరిశీలించారు. అనంతరం సీఎం సందర్శించేందుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు   సూచనలిచ్చారు. అనంతరం జొన్నవాడలో భారీగా కోతకు గురైన పొర్లుకట్టను పరిశీలించారు. సాయంత్రం ఇంటలిజెన్స్‌ ఎస్పీ, కలెక్టర్‌, జిల్లా ఎస్పీ ఈ ప్రాంతాలను పరిశీలించి సీఎం బందోబస్తు విషయమై ఎమ్మెల్యేతో చర్చించారు. బారికేడ్ల ఏర్పాటుతో సీఎం వద్దకు తక్కువ మందిని అనుమతించాలని కలెక్టర్‌, ఎస్పీ అధికారులకు సూచించారు. జొన్నవాడలో  పొర్లుకట్ట దగ్గర్నుంచి పెనుబల్లిలో కోతకు గురైన రోడ్డు వరకు బందోబస్తు విషయంపై అధికారులకు పటిష్ఠమైన ఆదేశాలిచ్చారు. వీరి వెంట పలు శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement