Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టాలి

ఘట్‌కేసర్‌: మానవాళిని చిన్నాభిన్నం చేసే ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీలోని అన్నోజిగూడలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగాంగ ప్లాస్టిక్‌ వాడకం వల్ల సంభవించే దుష్పరి ణామాలను ప్రజలకు తెలియజేసేందుకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. చైర్మన్‌ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, దీనికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరం అన్నారు. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం పెరిగి ఎన్నో ఇబ్బందులకు గురువుతున్నామని గుర్తు చేశా రు. కవర్లలో పాడైన తినుబండారాలను పెట్టి బయట పారేయడం వల్ల వాటిని జంతువులు తిని ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ వాడకంతో వివిధ క్యాన్సర్లు సోకే ప్రమాదముందన్నారు. చెత్తను చెత్తబుట్టల్లో భద్రపర్చుకొని మున్సిపల్‌ వాహనాల్లో వేసి పరిసరాల పరిశుభ్రతకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ ననావత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement