Abn logo
Sep 24 2020 @ 05:09AM

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ లిస్టులో అర్హుల పేర్లు తొలగింపు

పెద్దారవీడు, సెప్టెంబరు 23: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా మండలంలోని గుండంచర్ల, సుంకేసుల, కలనూతల గ్రామాలలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి అర్హులను గుర్తించేందుకు అధికారులు రీ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ ్యంలో కలనూతల గ్రామానికి చెందిన కొంతమంది పేర్లు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


2006-07 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సోషల్‌ ఎకానమిక్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం కేఎన్‌ 107, సిరియల్‌ నంబర్‌ 122తో గెజిటెడ్‌లో నమోదై ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. కానీ అధికారుల తప్పిదం వలన ప్యాకేజీ లిస్ట్‌, 2008 సంవత్సరంలో సోషల్‌ ఎకనామిక్‌ సర్వేలో తమ పేర్లు గల్లంతుయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.


ప్యాకేజీ లిస్టులో దర్శనం పెద్ద లక్ష్మయ్య, దర్శనం కాశమ్మ, దర్శనం సంతోష్‌ కుమారి, దర్శనం రాజు, దర్శనం మౌనిక పేర్లు గల్లంతయ్యాయని వారు తెలిపారు. సంబంధిత అధికారులు పట్టించుకోని గ్రామాలలో సమగ్ర విచారణ జరిపి అర్హులను గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతు.

Advertisement
Advertisement
Advertisement