Abn logo
Sep 26 2020 @ 04:23AM

నకిలీ పత్రాలతో మోసం చేసిన అన్నదమ్ములకు రిమాండ్‌

ఖైరతాబాద్‌,సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): తప్పుడు పత్రాలతో మరొకరి స్థలాన్ని తమ పేరుపైకి మార్చుకున్న ముగ్గురు అన్నదమ్ములను సైఫాబాద్‌ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం నగరంలో ఉన్న అమీదా ఖాతూన్‌ అనే మహిళకు చెందిన స్థలాన్ని అదే ప్రాంతానికి చెందిన రఫీక్‌ఖాన్‌(51), రహీమ్‌ఖాన్‌(63), అనీ్‌ఫఖాన్‌(40)లు నకిలీ డాక్యుమెంట్లు పెట్టి తమ పేరిట 1991లో మార్చుకున్నారు. అమీదా కుమార్తెలు ఆ స్థలాన్ని 2008లో ఇస్రాతుల్లాఖాన్‌ పేరిట జీపీఏ చేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించగా ఆర్‌వోఆర్‌లో స్థలం మరొకరి పేరుతో ఉన్నట్లు తేలింది.


ఈ విషయ మై వారు ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించగా స్థల విషయమై సమగ్ర విచారణ జరపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ విచారణను ఆపాలని పథకం వేసిన అన్నదమ్ములు అమీదా కుమార్తెలు ఆ స్థలాన్ని మహ్మద్‌అలీ ఇస్లామీ అనే వ్యక్తి పేరిట జీపీఏ ఇచ్చినట్లు తప్పుడు పత్రాలను సృష్టించి జాయింట్‌ కలెక్టర్‌ను సంప్రదించారు. తాము ఇరువురం రాజీ కుదుర్చుకుంటున్నట్లు చెప్పగా ఆయన నిజమేన ని భావించి కింది స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విచారణ నిలిచిపోవడంతో బాధితులైన అక్కాచెల్లెళ్లు అసలు విషయాన్ని తెలుసుకొని ఇస్రాతుల్లాఖాన్‌తో నాంపల్లి కోర్టులో కేసు వేయించారు. న్యాయమూర్తి విచారణకు కేసును సైఫాబాద్‌ ఠాణాకు బదిలీ చేయగా పోలీసులు విచారించారు. ఫోర్జ రీ, చీటింగ్‌లకు పాల్పడిన ముగ్గురు అన్నదమ్ములను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
Advertisement
Advertisement