Abn logo
Sep 25 2020 @ 04:41AM

అనురాగ్‌ సెట్‌ పరీక్షా ఫలితాల విడుదల

Kaakateeya

ఘట్‌కేసర్‌ రూరల్‌: మండలంలోని వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో గురువారం అనురాగ్‌సెట్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. అనురాగ్‌ యూనివర్సిటీ వైఎస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రంతో పాటు సీఈవో నీలిమారెడ్డి, రిజిష్ట్రార్‌ సైదా సమీన్‌ ఫాతీమా, యూనివర్సిటీ స్టూడెంట్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ పల్లా పరీక్షా ఫలితాల సీడీని విడుదల చేశారు. మొదటి నుంచి 55 ర్యాంకులు సాధించిన విద్యార్థులను అనురాగ్‌ పల్లా అభినందించారు. వీరికి ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షా పోటీల్లో 8వేల మంది పాల్గొన్నారని తెలిపారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడమే అనురాగ్‌ యూనివర్సిటీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement