Abn logo
Aug 7 2020 @ 03:43AM

పీజీ కోర్సులకు రీయింబర్స్‌మెంట్‌ లేనట్టే(నా)?!

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ)కోర్సులకు ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ కోర్సులతో పాటు ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులైన ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ  కోర్సులన్నింటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సులు చేస్తున్న విద్యార్థులు సుమారు 74,500 మంది ఉన్నారు. 2019-20కి యూజీ కోర్సులకు రీయింబర్స్‌ చేసి, పీజీ కోర్సు ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు.

Advertisement
Advertisement
Advertisement