Abn logo
Jul 13 2020 @ 19:50PM

భారత్‌లో అడుగుపెట్టేస్తున్న రెడ్‌మి నోట్9

న్యూఢిల్లీ: అభిమానులను ఊరిస్తున్న ‘రెడ్‌మి నోట్ 9’ భారత్‌లో కాలుమోపేందుకు సిద్ధమైంది. ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో దీనిని విడుదల చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌లోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా, తాజాగా ఇండియాలోనూ దీనిని విడుదల చేయబోతున్నట్టు షియోమీ టీజ్ చేసింది. అయితే, ధర వివరాలను మాత్రం వెల్లడించలేదు. 


రెడ్‌మి నోట్ 9 ధర, స్పెసిఫికేషన్లు: ఈ ఫోన్ 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు 14,900 ఉండే అవకాశం ఉంది. అలాగే, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 18,700 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ను విడుదల చేసే 20వ తేదీనే ధరలను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం.


6.53 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో జి85 ప్రాసెసర్, వెనకవైపు నాలుగు కెమెరాలు, హోల్  పంచ్ డిజైన్, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement