Advertisement
Advertisement
Abn logo
Advertisement

8జీబీ ర్యామ్‌తో వచ్చేసిన రెడ్‌మీ నోట్ 10ఎస్.. ప్రారంభ ఆఫర్‌గా రూ. 1000 తగ్గింపు

న్యూఢిల్లీ: ‘రెడ్‌మి నోట్ 10ఎస్’ న్యూ వేరియంట్‌ భారత్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికే రెండు వేరియంట్లు.. 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ఆప్షన్లు విడుదల కాగా తాజాగా 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 


రెడ్‌మీ నోట్ 10 ఎస్ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర భారత్‌లో రూ. 17,499 మాత్రమే. ఎంఐ.కామ్, అమెజాన్ ఇండియా, ఎంఐ హోం స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. రేపు (3న) మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ మొదలు కానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐలపై రూ. 1,000 తక్షణ రాయితీ లభిస్తుంది. 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 14,999 కాగా, 6జీబీ+128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 15,999 మాత్రమే. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. 


రెడ్‌మి నోట్ 10ఎస్ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జి95 ఎస్ఓసీ,  64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 13 ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్న ఈ మొబైల్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించారు. 

Advertisement
Advertisement