Abn logo
Sep 23 2021 @ 19:50PM

ఇండియాలో లాంచ్ అయిన Redmi 9 Activ.. స్పెసిఫికేషన్లు ఇవే

న్యూఢిల్లీ: రెడ్‌మి 9 యాక్టివ్ సైలెంట్‌గా ఇండియాలో లాంచ్ అయింది. అమెజాన్‌లోనూ అప్పుడే ఇది లిస్ట్ అయింది. ఈ ఫోన్ రేపటి (శుక్రవారం) నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటుందని షియోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మి ప్రకటించింది. అమెజాన్, ఎంఐ.కామ్‌తోపాటు ఎంఐ హోంస్టోర్స్‌, ఎంఐ స్టూడియోలలో ఇది అందుబాటులో ఉంటుందని రెడ్‌మి అధికారిక ట్విట్టర్ ఖాతా పేర్కొంది. అయితే, రెడ్‌మి 9 యాక్టివ్ ధర ఇండియాలో ఎంత అన్నది తెలియరాలేదు. అయితే, పలు స్పెసిఫికేషన్లను మాత్రం అమెజాన్ వెల్లడించింది. రెడ్‌మి 9 యాక్టివ్ 4జీబీ+64 జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. కార్బన్ బ్లాక్, కోరల్ గ్రీన్, మెటాలిక్ పర్పుల్ రంగుల్లో ఆకట్టుకునేలా ఉంది. 


రెడ్‌మి 9 యాక్టివ్ స్పెసిఫికేషన్లు:  ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్, 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియా జి35 చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 128 జీబీ స్టోరేజీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ చార్జ్‌తో 35 గంటల టాక్‌టైమ్ , వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉండే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption