Abn logo
Sep 28 2020 @ 14:52PM

రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం

Kaakateeya

8 మంది కూలీలు అరెస్టు 


రాజంపేట: పెద్దఎత్తున ఎర్రచంద నం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకుని 8 మంది కూలీలను అరె స్టు చేశామని రాజంపేట రేంజర్‌ నారాయణ తెలిపారు. ఆ దివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. రా జంపేట మండలం రాయచోటి రోడ్డులోని రోళ్లమడుగు ఫా రె్‌స్టబీట్‌లో దుంగలు తరలిస్తున్నారన్న సమాచారంతో సు మారు 30 మందితో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కూంబింగ్‌ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.


ఆదివారం తెల్లవారుజామున రోళ్లమడుగు ఫారె్‌స్టబీట్‌ పరిధిలోని చింతలతీగలకోనలో రవాణాకు సిద్ధంగా ఉంచిన ఏ-గ్రేడు ఎర్రచందనం దుంగల డంప్‌ను కనుగొని స్వాధీనం చేసు కున్నామన్నారు. సుమారు 4.60 టన్నులు బరువున్న 123 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 8 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీలను అరెస్టు చేశామ న్నారు. ఎర్రచందనం దుంగల విలువ కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. దాదాపు 80 మంది తమిళనాడుకు చెందిన కూలీలు వచ్చి జట్లు జట్లుగా విడిపోయి చెట్లను నరుకుతున్నారని తమకు పక్కా సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో కూంబింగ్‌ చేసి దుంగలు స్వాధీనం చే సుకున్నామన్నారు.


తమిళనాడుకు చెందిన కూలీలు కుమారస్వామిచంద్ర, కుప్పుస్వామికుమార్‌, పాండుదురై, గోవిందజయమణి, కుప్పస్వామి కమాల్‌, పొన్నుస్వామిమురగన్‌, పాండుహరిశివన్‌, మాణిక్యం సిలమరసన్‌లను అరెస్టు చే సి నందలూరు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. దా డుల్లో అటవీ శాఖాధికారులు వై.వి.నరసింహరావు, ఆర్‌.నారాయణ, ఎన్‌.రఘుశంకర్‌, ప్రసాద్‌, బోస్‌, భాగ్యమ్మ, పీర య్య, పుల్లన్న, శంకరయ్య, రెడ్డి, రాజారావు, సుబ్బరాయు డు, బేస్‌క్యాంపు సిబ్బంది పాల్గొన్నారని రేంజర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement