Abn logo
Jun 4 2020 @ 03:40AM

రెడ్‌క్రాస్‌ సేవలు భేష్‌: గవర్నర్‌

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కరోనా క్లిష్ట సమయంలో రెడ్‌క్రాస్‌ సంస్థ అందించిన సేవలు సంతృప్తికరమని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకు కొనసాగనుండడంతో ఈ సేవలను మరింతగా చేయాలని పిలుపునిచ్చారు. రెడ్‌క్రాస్‌ సంస్థ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. జిల్లా గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించే కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన, ప్రజల్లో అవగాహన కల్పించే  కార్యక్రమాలను రెడ్‌క్రాస్‌ పెద్దఎత్తున చేపట్టిందని గవర్నర్‌ కితాబిచ్చారు. రక్త నిల్వల విషయంలోనూ మంచి సేవలందిస్తోందన్నారు. జిల్లాస్థాయిలో సేవా కార్యక్రమాలు బాగా నిర్వహించినవారిని గవర్నర్‌ అభినందించారు. ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండేలా చైతన్యపర్చాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. తన విచక్షణ నిధుల నుంచి రూ.5 లక్షలను రెడ్‌క్రా్‌సకు విరాళంగా అందించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ ఏపీ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే పరీడా, గవర్నర్‌ కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement