Abn logo
Jun 4 2020 @ 04:57AM

రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), జూన్‌ 3: కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్‌ హరికిరణ్‌ రాష్ట్ర గవర్నర్‌కు వివరించారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవల నిర్వహణపై బుధవారం రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శి ముకేష్‌ కుమార్‌ మీనా, రెడ్‌ క్రాస్‌రాష్ట్ర శాఖ చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.కే.పరిడాలతో కలసి రాష్ట్ర గవర్నర్‌ హరిచంద్‌న్‌ రాజ్‌భవన్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీలు సాయికాంత్‌వర్మ, శివారెడ్డి, డీఆర్వో రఘునాధ్‌లు పాల్గొన్నారు.


కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌-19 విపత్కర సమయంలో అన్ని వ్యాపార, ఉపాధి కార్యకలాపాలు స్తంభించి జనజీవనం ఇబ్బందులకు గురైన సమయంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా బ్రాంచి విస్తృతమైన సేవలందించడం అభినందనీయమన్నారు. అనంతరం కడప రెడ్‌క్రాస్‌ సంస్థ చైర్మన్‌ ఏ.పిచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ చేస్తున్న సేవలను రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యక్ష్యంగా సమీక్షించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సెక్రటరి మునిరాజు, సభ్యులు విజయభాస్కర్‌, కోశాధికారి శివారెడ్డి, డీఎంహెచ్‌ఓ డా.ఉమాసుందరిలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement