Abn logo
Sep 24 2020 @ 01:02AM

ప్రజాక్షేమానికి పాటుపడే నాయకులకు గుర్తింపు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 


కందుకూరు: ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకులకే టీఆర్‌ఎస్‌ పార్టీలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆపార్టీ ఎస్సీసెల్‌ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన కందుకూరు మండలం మీర్కాన్‌పేట గ్రామానికి చెందిన చిర్ర సాయిలుకు బుధవారం నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిర్ర సాయిలు పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ చైర్మన్‌ ఎస్‌ వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ సామ ప్రకా్‌షరెడ్డి, నాయకులు జిల్లెల కృష్ణారెడ్డి, బి.బాలకృష్ణ, జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మన్నె జయేందర్‌ముదిరాజ్‌, సా మ మహేందర్‌రెడ్డి, కాకి నర్సింహ్మ, సదానంద్‌గౌడ్‌, పరంజ్యోతి, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు గుయ్యని సామయ్య, బి.వెంకటేష్‌, టి.కార్తీక్‌, మీర్కాన్‌పేట, కటికపల్లి సర్పంచులు బి.జ్యోతిచంద్రశేఖర్‌, బి.నరేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement