Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెలసరి సక్రమంగా రాకుండా ఉండడానికి గల కారణాలేంటి?

ఆంధ్రజ్యోతి(13-01-2021)

ప్రశ్న: నాకు ఇరవై అయిదేళ్లు. రుతుక్రమం సరిగా రాదు. ఏదైనా పోషకాహార లోపం వల్ల ఇలా జరుగుతుందా?


- సమన, ఆదోని 


డాక్టర్ సమాధానం: నెలసరి సక్రమంగా రాకుండా ఉండడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. హార్మోనుల అసమతుల్యత, రక్తహీనత వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ముందుగా సమస్యకు కారణం తెలుసుకొని దానికి తగిన  వైద్యం చేయించుకోవాలి. రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ ఆకుకూరలు ఏదో ఒక రూపంలో తినాలి. శనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు వంటి గింజలతో కూరలను కూడా మూడు సార్లు తీసుకోవాలి. ఈ ఆహారంలో ఉండే ఇనుమును మన శరీరం శోషించుకోవడానికి విటమిన్‌- సి అవసరం. విటమిన్‌ - సి అధికంగా ఉండే అన్ని రకాల పండ్లు, నిమ్మ రసం, పచ్చి క్యాప్సికమ్‌ కూడా రోజూ తీసుకోవాలి. సోయా గింజలు, సోయా ఉత్పత్తులైన సోయా పనీర్‌, మీల్‌ మేకర్‌ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆందోళన అధికమైతే కూడా నెలసరి సరిగా రాదు కాబట్టి ఆందోళన తగ్గించుకొని తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement