Abn logo
Sep 20 2021 @ 20:33PM

IPL2021: పది ఓవర్లకు బెంగళూరు స్కోరు ఎంతంటే?

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పది ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. సచిన్ బేబీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆట ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 5 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. ప్రసీద్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ పరుగులు పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 41 పరుగుల వద్ద పడిక్కల్ అవుటయ్యాడు. 20 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన పడిక్కల్ ఫెర్గ్యూసన్ బౌలింగులో కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే 16 పరుగులు చేసిన భరత్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక, సిక్సర్ల వర్షం కురిపిస్తాడనుకున్న డివిలియర్స్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. 

క్రైమ్ మరిన్ని...