Abn logo
Sep 28 2021 @ 15:22PM

ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్...

ముంబై : నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్దారణ కావడంతో     పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొరఢా ఝులిపించింది ఆర్‌బీఎల్ చట్ట విరుద్దంగా ఖాతాలు తెరిచినట్టు తమ పరిశీలనలో తేలినట్టు ప్రకటించింది. మార్చి 31, 2019 న ఇన్స్పెక్షన్ ఆఫ్ సూపర్‌వైజరీ ఎవాల్యూయేషన్ లో బ్యాంకు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. 


ఆర్‌బిఐ బ్యాంక్ రిస్క్ అసెస్‌మెంట్ నివేదికతోపాటు ఐఎస్‌ఈ 2019 పరిశీలనలో కో ఆపరేటీవ్ పేరిట ఐదు సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు తెరవడంలో బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆదేశాలతోపాటు 1949 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. బ్యాంక్,  డైరెక్టర్ల బోర్డు విషయంలో చట్టంలోని సెక్షన్ 10ఏ(2) (బీ) నిబంధనలను పాటించడంలో వైఫల్యం చెందినట్టు ఆర్‌బీఐ గుర్తించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు /  పాటించనందుకు... జరిమానాను ఎందుకు విధించకూడదో చెప్పాలని బ్యాంకుకు ఆర్‌బిఐ నోటీసు జారీ చేసింది.