Oct 16 2021 @ 10:19AM

Ramarao on Duty : 80 శాతం షూటింగ్ పూర్తి!

మాస్ మహారాజా రవితేజ సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ, శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ చిత్రాల్లో నటిస్తుండగా.. రీసెంట్ గా ఆయన మరో చిత్రానికి కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ లో కూడా ఆయన హీరోగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.  ఈ సినిమాని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

ఇక వీటిలో ఖిలాడీ మూవీ 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. రామారావు ఆన్ డ్యూటీ మూవీ అప్పుడే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందట. ఇందులో సిన్సియర్ యమ్మార్వోగా రవితేజ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో ఆయన యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టడమే కాకుండా.. మంచి ఎమోషన్స్ ను కూడా పలికిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో  ‘మజిలీ’ బ్యూటీ దివ్షాన్స్ కౌశిక్, మలయాళ బ్యూటీ రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరి రామారావు గా రవితేజ ఏ రేంజ్ లో చెలరేగుతారో చూడాలి.