Abn logo
Aug 11 2020 @ 17:51PM

రవీంద్ర జడేజా భార్యకు, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం

రాజ్‌కోట్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు, ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్య సోమవారం రాత్రి మాస్క్ విషయంలో గొడవ జరిగింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో రవీంద్ర జడేజా అతని భార్యతో కలిసి వెళుతుండగా పోలీసులు కారును ఆపారు. ఈ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న జడేజా మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అతని భార్య రివాబా మాస్క్ ధరించలేదు. దీంతో.. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ఆమెను సోనల్ అనే ఓ మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించింది. ఈ విషయంలో ఒకరికొకరికి మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కిషన్‌పర చౌక్‌లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Advertisement
Advertisement
Advertisement