Advertisement

హీరోలని ప్రేమించినందుకు హీరోయిన్‌లను వారు అవమానించేవారంటున్న Raveena Tandon

మహిళ జర్నలిస్టులపై అలనాటి హీరోయిన్ రవీనా టండన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోలని ప్రేమించినందుకు హీరోయిన్‌లను వారు అవమానించేవారని ఆమె పేర్కొంది. 


రవీనా టండన్ సోషల్ మీడియాకు థ్యాంక్స్ చెబుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధంగా గతంలో సోషల్ మీడియా లేదని చెప్పింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌తో అభిమానులతో నేరుగా మాట్లాడవచ్చని ఆమె వెల్లడించింది. తాజాగా ఆమె మీడియాకు  ఇంటర్వ్యూ ఇచ్చింది. 1990ల నాటి మహిళ జర్నలిస్ట్‌ల గురించి మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ కొంత మంది ఉమెన్ ఎడిటర్స్‌ని నేను చూశాను. కానీ, ఆ విధంగా వారు ప్రవర్తించలేదు. బయట మాత్రం ఫెమినిస్ట్ అని చెప్పుకుని తిరిగేవారు. హీరోయిన్లు, హీరోలను ప్రేమిస్తే బాడీ షేమింగ్‌కి గురిచేసేవారు. వారిని అవమానించేవారు, మానసికంగా కుంగిపోయేలా చేసేవారు. ఎందుకంటే వారికి హీరో అంటే ప్రేమ ఎక్కువగా ఉండేది. ఈ జర్నలిస్టులు పనిచేసే మ్యాగజైన్ కోసం హీరో అప్పటికే ఫొటోషూట్ చేస్తానని వాగ్దానం చేసి ఉండేవాడు ’’ అని రవీనా టండన్ చెప్పింది.   


‘‘ స్వ ప్రయోజనాల రీత్యా ఆ జర్నలిస్టులకి హీరోలని ప్రేమించే హీరోయిన్‌లు అంటే ఇష్టం ఉండేది కాదు. మహిళ జర్నలిస్టుల దయ మీదనే ఆ హీరోయిన్‌లు బతకాల్సి ఉండేది. అందుకే సోషల్ మీడియాకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. అభిమానులకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మనం చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పవచ్చు.  సాక్ష్యాధారాలను వారికే చూపెట్టవచ్చు.  గతంలో మాత్రం హీరోయిన్‌లని పతాక శీర్షికాలకెక్కించి అవమానించేవారు ’’ అని ఆమె వెల్లడించింది. 


ప్రస్తుతం ఆమె అరణ్యక్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆమెకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ డెబ్యూగా నిలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 10, 2021నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Advertisement

Bollywoodమరిన్ని...