Sep 15 2021 @ 00:56AM

రావణ్‌ లీల కాదు... భవాయి!

‘స్కామ్‌ 1992’ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీ హీరోగా హార్దిక్‌ గాంధీ దర్శకత్వంలో రూపొందిన సినిమా టైటిల్‌ మారింది. తొలుత ఈ చిత్రానికి ‘రావణ్‌ లీల’ టైటిల్‌ నిర్ణయించారు. గత వారం ట్రైలర్‌ విడుదల చేశారు. రామాయణం నాటకంలో రావణుడి పాత్ర పోషించే యువకుడిగా ప్రతీక్‌ గాంధీ  కనిపించారు. తమ మనోభావాలను కించపరిచేలా ‘రావణ్‌ లీల’ టైటిల్‌ పెట్టడం తగదని హిందువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో టైటిల్‌ మార్చక తప్పలేదు. ‘రావణ్‌ లీల’ టైటిల్‌ను ‘భవాయి’గా మారుస్తున్నట్టు మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. 


Bollywoodమరిన్ని...