Abn logo
Jan 20 2021 @ 23:38PM

రేషన్‌ బియ్యం పట్టివేత

ఆదిభట్ల : రేషన్‌ బియ్యం పట్టుబడిన సంఘటన ఆదిభట్ల పోలీసుస్టేషన్‌ పరిధి తుర్కయాంజాల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ డివిజన్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వివరాల ప్రకారం.. తుర్క యాంజల్‌లోని హెచ్‌కేజీఎన్‌ పార్కింగ్‌ యార్డు వద్ద లారీలో రేషన్‌ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం మేరకు ఎస్‌ఐ అ వినాష్‌, సిబ్బందితో దాడులు నిర్వహించారు. 15 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకోని లారీ ఓనర్‌ కృష్ణ(58) డ్రైవర్‌ వెంకటేశ్వర్లు (52)లను అదుపులోకి తీసుకున్నారు. కాగా అదే సమయంలో ఆగి ఉన్న డీజిల్‌ ట్యాంకర్‌ నుంచి డీజీల్‌ దొంగిలిస్తున్న ఎండీ పాషా (42), ఎండీ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ (32), దాజూద్దీన్‌బాబా(28)లను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్‌ఓటీ సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిభట్ల సీఐ నరేందర్‌ తెలిపారు.

Advertisement
Advertisement