Abn logo
Jun 4 2020 @ 03:58AM

సచివాలయాల్లోనే రేషన్‌ కార్డులు

  • దరఖాస్తు చేసిన 5 రోజుల్లో అందజేత


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకుని, అక్కడే పొందే విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 6 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పేదలకు కార్డులు అందించేలా నూతన విధానాన్ని రూపొందించారు. బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశంలో కొత్త విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అలాగే రేషన్‌ డోర్‌ డెలివరీలో భాగంగా తీసుకొస్తున్న నూతన విధానం అమలు కోసం ఇంటికి 1-2 సంచులు అందజేయనున్నారు. ఈ సంచుల మోడల్‌ను సీఎంకు చూపించగా ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే ఈ సంచులను పెద్దమొత్తంలో తయారుచేయనున్నారు. 10,15 కిలోల సంచులను కార్డుదారులకు అందజేస్తారు. ఒక్కో సంచి తయారీకి రూ.25 ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement