Abn logo
May 31 2020 @ 17:39PM

చరణ్‌కు హీరోయిన్ దొరికిందా?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ త‌న తండ్రి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’లో న‌టించాల్సి ఉంది. క‌రోనా ప్ర‌భావంతో ఆగిన సినిమా షూటింగ్స్‌లో త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ఆ క్రమంలో ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి త‌ర్వాత ‘ఆచార్య‌’లో చెర్రీ న‌టిస్తాడ‌ట‌. ‘ఆచార్య‌’లో చర‌ణ్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చిరుకు మార్గ‌నిర్దేశం చేసేలా ఉంటుంద‌ట‌. చ‌ర‌ణ్‌కు ఇందులో జోడీ కూడా ఉంద‌ట‌. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఎవ‌రిని న‌టింప చేస్తార‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నాను న‌టింప చేస్తార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement