May 15 2021 @ 08:19AM

పబ్లిసిటీకి దూరంగా..అనాథలకు అండగా రాశీఖన్నా

కరోనా వైరస్‌ మహమ్మారి కష్టంలో సినీ సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు సమాజ సేవలో అంకితంకాగా, మరికొందరు లాక్‌డౌన్‌ సమయంలో అనేక మంది అనాథలు, భిక్షగాళ్ళ ఆకలిదప్పులు తీర్పుతున్నారు. ఇలాంటి వారిలో హీరో యిన్ రాశీ ఖన్నా కూడా ఉన్నారు. ముంబై మహానగరంలో ఆకలితో అలమటిస్తూ రోడ్డు పక్కన నివసించేవారిని ఆదు కునే పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం ఓ స్వచ్చంధ సంస్థతో కలిసి  ఆహారం సమకూర్చుతోంది. అయితే, ఈ విషయాన్ని ఆమె ఎక్కడా బహి ర్గతం చేసుకోవడం లేదు. పైగా ఈ పనులు సాఫీగా సాగేందుకు ప్రత్యేకంగా ఒక టీమ్‌ కూడా ఏర్పాటు చేశారు. స్వచ్చంధ సంస్థతో కలిసి ఈ బృందం పనిచేస్తోంది. అలాగే, మరికొందరు నటీనటులు కూడా ఇలాంటి చర్యల్లో నిమగ్నమైవున్నారు. వీరంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు. అలాగే, రాశిఖన్నా కూడా పబ్లిసిటీ లేకుండానే అనేక మంది ఆకలి తీర్చుతోంది.