Abn logo
May 4 2021 @ 03:00AM

వేగంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం

విద్యార్థులు, వృద్ధులందరికీ ‘కంటివెలుగు’

‘నాడు-నేడు’ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌


అమరావతి,మే3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, వాటి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయలో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖలో ‘నాడు-నేడు’పై ఆయన సమీక్షించారు. ‘‘జ్యుడీషియల్‌ రివ్యూ పూర్తి చేసుకుని, టెండర్లను పిలిచిన కాలేజీల నిర్మాణపనులు వెంటనే చేపట్టాలి.  ఉభయగోదావరి, కృష్ణా, కర్నూలుజిల్లాల్లో మెడికల్‌ కాలేజీలకోసం భూసేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం జరగకుండా కలెక్టర్లతో మాట్లాడాలి. వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలి. ఈ రంగానికి నిధుల కొరత లేకుండా చూడాలి’’ అని తెలిపారు. ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల టెండర్లు ఖరారయ్యాయని, మిగిలిన 12 కాలేజీల టెండర్ల ప్రక్రియను కూడా ఈ నెల 21వ తేదీలోగా ప్రారంభించాలని ఆదేశించారు. వైఎ్‌సఆర్‌ కంటి వెలుగు కింద వృద్ధులకు ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడంతోపాటు, అవసరమైన వారికి ఆపరేషన్లూ చేయాలని ఆదేశించారు. కంటి పరీక్షలు .. కళ్లద్దాల పంపిణీ, శస్త్ర చికత్సల్లో జాప్యం జరిగేందుకు వీల్లేదన్నారు.

Advertisement
Advertisement
Advertisement