Abn logo
May 21 2020 @ 03:55AM

బాలికపై అత్యాచారం

నెల రోజుల కిందట అఘాయిత్యం

ఊరి పెద్దమనుషుల మధ్య రాజీకి యత్నం

ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో 376, పోక్సో కేసు నమోదు


వనపర్తి, మే 20 (ఆంధ్రజ్యోతి) : తన కూతురిపై అత్యా చారం జరిగిందని, నెల రోజులుగా ఊర్లో పంచాయితీ చేయ డానికి ప్రయత్నిస్తున్నారని, తన కుటుంబంపై దాడికి ప్రయ త్నిస్తున్నారని ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. 


బాధితురాలి తల్లి కథనం ప్రకారం వనపర్తి జిల్లా గోపాల్‌ పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాహుల్‌ (21) అనే యువకుడు గతనెల 8న అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి తల్లి ఊ రిపెద్దలను ఆశ్రయించగా, అందరి సమక్షంలో రూ.2 లక్షల క ట్నం, నాలుగు తులాల బంగారం ఇచ్చి ఇరువురికి వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈనెల 7న తాను పెళ్లి చేసుకో నని రాహుల్‌, శ్యామలమ్మ, తిక్కమ్మ, యాదగిరి, శేషయ్య, మ ణ్యమ్మ, నరసింహ, లక్ష్మయ్య అనే వ్యక్తులు తన కుటుంబం పై దాడికి ప్రయత్నించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పే ర్కొన్నారు.


ఇదే విషయమై గోపాల్‌పేట పోలీసులను ఆశ్ర యించగా ఊర్లోనే రాజీ కుదుర్చుకోవాలని, రాజీ కుదరకపోతే తమను సంప్రదించాలని హితవు పలికినట్లు ఆమె తెలిపా రు. దీంతో ఈ నెల 16న ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యా దు చేశారు. గోపాల్‌పేట ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ను వివరణ కోర గా పరస్పర అంగీకారంతో వివాహం నిశ్చయమైందని, అం దువల్లే తాము కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం నిందితుడిపై సెక్షన్‌ 376, ఫోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement