Abn logo
Oct 22 2020 @ 09:01AM

బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు

Kaakateeya

గ్రేటర్ నోయిడా : ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. గ్రేటర్ నోయిడా నగరంలోని సుర్జాపూర్ ప్రాంతానికి చెందిన సోను ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడైన సోనుపై పోస్కో కింద కేసు నమోదు చేసి నోయిడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న సోను పోలీసులపై దాడికి దిగి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో సోను గాయపడ్డాడని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ అంకూర్ అగర్వాల్ చెప్పారు. కాల్పుల్లో గాయపడిన రేపిస్టును పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement