ఆ సీన్లకు నో చెబుతున్న హీరో, హీరోయిన్లు.. కారణమేంటో అని బీ టౌన్ లో గుసగుసలు

ఎటువంటి పాత్రను అయినా అవలీలగా పోషించే నటీనటులు ఆలియా భట్, రణ్ వీర్ సింగ్. తమ నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తారు. కానీ, ప్రస్తుతం వారు కొన్ని సీన్లకు నో చెబుతున్నారు. తెర మీద ముద్దు సీన్లను చేయబోమని అంటున్నారు. గతంలో వారు అనేక చిత్రాల్లో అటువంటి సీన్లను చేశారు. నేడు మాత్రం ససేమిరా అంటున్నారు. అందుకు కారణం ఏంటో అని బాలీవుడ్‌లో అందరు చర్చించుకుంటున్నారు.  


ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై  కరణ్ జోహార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ చిత్రం పేరు ‘‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’’. ప్రేమ కథ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ ప్రేమికులుగా నటిస్తున్నారు. ప్రేమ కథ చిత్రం కాబట్టి సినిమాలో కొన్ని లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. కానీ, ఆ సీన్లను చేయడానికి హీరో, హీరోయిన్లు ఇద్దరు కూడా మొండికేస్తున్నారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘‘ రణ్ వీర్, ఆలియా ముద్దు సీన్లను చేయకూడదని నిర్ణయించుకున్నారో లేదో నాకు తెలియదు. ఆన్‌స్ర్కీన్ మీద రొమాన్స్ సీన్లు చేయొద్దని హీరో, హీరోయిన్లకి వారి పార్ట్‌నర్స్ చెప్పారని నేను అనుకోవట్లేదు. కానీ, కరణ్ జోహార్ సినిమాలో ముద్దు సీన్లకు మాత్రం వారు నో చెబుతున్నారు ’’ అని చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తి చెప్పారు. 


గతంలో కరణ్ జోహార్  ‘‘యే దిల్ హై ముష్కిల్’’ సినిమాకు దర్శకత్వం వహించారు. అనంతరం ఐదేళ్లకు  ‘‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ’’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. 

Advertisement

Bollywoodమరిన్ని...