Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెనుకబడ్డ గండిపేట మున్సిపాలిటీ.. ముందుకు వచ్చిన మణికొండ మున్సిపాలిటీకి ర్యాంక్‌

హైదరాబాద్/నార్సింగ్‌: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ర్యాంకుల జాబితాలో గండిపేట మం డలంలోని మూడు మున్సిపాలిటీలు వెనకబడ్డాయి. దేశవ్యాప్తంగా 319మున్సిపాలిటీలతో కూడిన జాబితా లో మణికొండ మున్సిపాలిటీకి 81వ స్థానం దక్కింది. బండ్లగూడ 18వ ర్యాంకు, నార్సింగ్‌ మాత్రం 9వ ర్యాంకులో నిలిచింది. శంషాబాద్‌ మున్సిపాలిటీ 4వ స్థానంలో నిలిచి ప్రత్యేక బహుమతి గెలుపొందింది. 

ఇప్పటికే వెనకబడిన మున్సిపాలిటీలకు సంబంధించి రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ అధికారులకు మార్గదర్శనం చేస్తున్నారు. మున్సిపాలిటీలు ఉండాల్సిన తీరు, పరిశుభ్రత తదితర అంశాలపై బుధవారం కూడా వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో భాగంగా మేనేజర్లు, ఇంజనీర్లకు సూచనలు, సలహాలతో పాటు వారు చేయాల్సిన విధులు స్పష్టంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో మణికొండలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌ పరిస్థితిని మెరుగుపరి గాడిన పెట్టేందుకు మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. 

Advertisement
Advertisement