Sep 21 2021 @ 12:39PM

రాణీ ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ ఎస్టోనియా షెడ్యూల్ పూర్తి

బిఫోర్ లాస్టియర్ ‘మర్దానీ 2’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫిల్మ్ ఫేర్ అవార్డు సైతం కైవసం చేసుకుంది బాలీవుడ్ నటీమణి రాణీ ముఖర్జీ.  ఈ ఏడాది  ఆమె నటించిన ‘బంటీ అవుర్ బబ్లీ 2’ విడుదలకు సిద్ధం కాగా.. ప్రస్తుతం ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ అనే డిఫరెంట్ మూవీతో బిజీగా ఉంది.  మోనీషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ.. ఈ సినిమాని ఎమ్మే ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ జీ స్టూడియోస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ఎస్టోనియా లో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఎస్టోనియాలో ఒక నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకొన్న ఈ షెడ్యూల్ .. కంప్లీట్ అయినట్టు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. బయో బబుల్ లో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఈ సినిమా టీమ్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక దేశం మీద ఓ తల్లి చేసే పోరాటమే .. ‘మిసెస్ చటర్జీ vs నార్వే’ మూవీ కథాంశం. ఇక ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఇండియాలో మొదలు కాబోతోంది.