Advertisement
Advertisement
Abn logo
Advertisement

Telangana: రాజేంద్రనగర్‌లో దొంగల గ్యాంగ్ హల్ హల్

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ కాటేదాన్‌లో దోపిడీ దొంగల గ్యాంగ్ హల్‌హల్ చేసింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద ఓ ఆటో డ్రైవర్‌‌ను అడ్డగించిన దుండగులు అతడిపై దాడి చేసి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. తుపాకీ చూసిన డ్రైవర్ ఆటోను వదలి తప్పించుకొనేందుకు యత్నించగా...దోపిడీ గ్యాంగ్  వెంటపడింది. చివరకు ఆటో డ్రైవర్‌ను పట్టుకుని రూ.3200 నగదు, సెల్ ఫోన్‌ను ముఠా సభ్యులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోటర్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు తుపాకితో బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్త ఐదు మంది ఉన్నట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. 

Advertisement
Advertisement