Abn logo
Oct 9 2020 @ 07:55AM

రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నార్సింగి బ్రిడ్జి కింద రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సూర్యాపేటకు చెందినవారిగా గుర్తించారు. మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement