Abn logo
Oct 17 2020 @ 09:13AM

శంషాబాద్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం ఉట్ పల్లిగ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గత అర్ధరాత్రి అనంతయ్య గౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 8 తులాల బంగారం, 5 సెల్‌ఫోన్లను అపహరించారు. పక్కనే ఉన్న భలరాం అనే వ్యక్తి ఇంటి తాళాలను పగులగొట్టేందుకు దుండగులు యత్నించారు. బాధితుల ద్వారా విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీంలను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. 

Advertisement
Advertisement