Abn logo
Oct 15 2020 @ 12:36PM

ప్రమాదకరస్థాయిలో మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు కట్ట

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి పల్లె చెరువు నుండి కిందకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. చెరువు  కోతకు గురవడంతో చెరువు కట్ట ప్రమాదకరస్థాయికి చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని లోతట్టు ప్రాంతాలవాసుల ఆందోళనకు గురవుతున్నారు.  జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఇరిగేషన్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పల్లెచెరువు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. మైక్‌ల ద్వారా పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అలీనగర్, సుబాన్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఇద్దరు మృతదేహాలు లభ్యం అవగా... మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
Advertisement