Sep 28 2021 @ 13:13PM

Ranbir Kapoorకు Amitabh Bachchan ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా?

బాలీవుడ్ సెలబ్రిటీలు సందర్భానుసారం ఒకరికొకరు అత్యంత ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ఇటీవల తన 39వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌కు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గతంలో ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారట. రూ.50 లక్షలు విలువ చేసే రిచర్డ్ మిల్లే బ్రాండ్ లగ్జరీ వాచ్‌ను అందించారట. ఆ గిఫ్ట్ చూసి రణ్‌బీర్ థ్రిల్ అయిపోయాడట. రణ్‌బీర్ ఎక్కడకు వెళ్లినా షూస్, లగ్జరీ వాచ్‌లను ఎక్కువగా కొంటుంటాడు. 


రణ్‌బీర్ గురించి తెలిసిన అమితాబ్ అత్యంత ఖరీదైన వాచ్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారట. అమితాబ్ కూడా గతంలో నిర్మాత విధు వినోద్ చోప్రా నుంచి ఇంతకంటే ఖరీదైన బహుమతిని అందుకున్నారు. `ఏకలవ్య` సినిమాలో అమితాబ్ నటన చూసి మురిసిపోయిన దర్శక నిర్మాత వినోద్ చోప్రా దాదాపు 8 కోట్ల రూపాయల ఖరీదు చేసే రోల్స్ రాయిస్ ఫోంటమ్ కారును బహుమతిగా అందించారట. ఇక, సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచినపుడు నిర్మాతల నుంచి హీరోహీరోయిన్లు ఖరీదైన బహుమతులు అందుకుంటుంటారు.  

Bollywoodమరిన్ని...