Abn logo
Apr 4 2020 @ 08:14AM

రణబీర్, ఆలియా పెళ్లిపై ఆసక్తికరమైన అప్ డేట్...!

ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే ప్రేమ జంటల్లో ర‌ణ‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ ముందు వ‌రుస‌లో ఉంటున్నారు. అయితే ఈ ఏడాదిలోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కాబోతున్నార‌ని బాలీవుడ్ సినీ వ‌ర్గాల స‌మాచారం. డిసెంబ‌ర్ 7 లేదా 21న వీరిద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే వీరిద్ద‌రి పెళ్లి నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ నాలుగు రోజులు నాలుగు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసి బ్ర‌హ్మాస్త్ర సినిమాలో జంట‌గా న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement