సంగీత దర్శకుడిగా రానా?

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేసే హీరోల్లో రానా ముందు వరుసలో ఉంటారు. రొటీన్ యాక్షన్ మూవీస్ కే ఫిక్సవకుండా.. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయడానికి ఎప్పడూ ప్రయత్నిస్తుంటారు ఆయన. ఒక పక్క సినిమాలు, మరో పక్క బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూన్న రానా రెండు మూడు సినిమాల్ని నిర్మించే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రానా సంగీత దర్శకుడిగా కూడా మారే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. తన స్నేహితుడు నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ అందించేందుకు రానా రెడీ అవుతున్నారట. దీనికి సంబంధించిన ఒక కొత్త ప్లాన్ ను తన స్నేహితుడికి అందించాడని, అది అతడికి బాగా నచ్చిందని తెలుస్తోంది. తనతో సన్నిహితంగా ఉండే ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో రానా ఈ ప్రయత్నం చేస్తున్నారట.


ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు దేవీశ్రీ ప్రసాదే. ఆయన తమ్ముడు సాగర్ తో కలిసి రానా.. తన స్నేహితుడి సినిమాకి సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తోంది. దేవీ సలహాలు, సూచనలతో రానా సినిమాకి మ్యూజిక్ కంపోజర్ గా మారుతున్నారట. అలాగే.. ఈ సినిమా కు రానా కొంత పెట్టుబడి కూడా పెట్టినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం రానా, పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా.. ‘విరాటపర్వం’ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది. 

Advertisement
Advertisement